Saturday, 01 August 2026 01:25:01 AM

ఫుట్‌బాల్ మ్యాచ్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ 100 మంది మృతి...

Date : 02 December 2024 08:39 PM Views : 547

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : పశ్చిమాఫ్రికా దేశం గినీలో ఆదివారం ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. గినీ మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశం లోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానం లోకి దూసుకెళ్లారు.దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకోడంతో ఘర్షణ చెలరేగింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కొందరు పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్ణణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై స్థానిక ఆస్పత్రి డాక్టర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 100 మంది మృతి చెందారని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :