Thursday, 30 July 2026 09:02:38 PM

25 పెళ్లిళ్లు – 25 మోసాలు....వధువు నటనలో మేటి అనురాధ

– వధువు కావాలనుకునే యువకుల నుంచి రూ. 2–5 లక్షల వరకు వసూలు.. – వివాహం జరిగిన కొన్ని రోజులకే డబ్బు, నగలతో పరార్

Date : 20 May 2025 07:48 PM Views : 1029

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : వధువు కోసం వేటలో ఉన్న యువకులకు ఇది గుణపాఠంగా మిగలే కథ! ‘ఒక్కసారి పెళ్లి అయితే జీవితాంతం తోడుగా ఉంటా’ అంటూ యువకుల్ని మాయలో ముంచిన ఓ నిత్య పెళ్లికూతురు చివరికి పోలీసుల బోనులో పడింది. తన అందం, మిఠాసైన మాటలతో ఇప్పటివరకు 25 మంది యువకులను పెళ్లి చేసుకుని, వారిలోని అమాయకత్వాన్ని వంచించి, లక్షల్లో డబ్బు, నగలు కొల్లగొట్టిన అనురాధ అనే మహిళ చివరకు రాజస్థాన్ పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సునీత, రాజస్థాన్‌కు చెందిన పప్పు మీనా అనే వ్యక్తులు వధువును వెతుకుతామని హామీ ఇచ్చి, ఓ యువకుడైన విష్ణు శర్మకు అనురాధ ఫోటోను చూపించారు. పెళ్లికి ముందే రూ. 2 లక్షలు తీసుకుని, ఏప్రిల్ 20న పెళ్లి చేయించారు. కానీ, వివాహం జరిగిన 12 రోజుల్లోనే అనురాధ డబ్బు, నగలు, మొబైల్‌తో పరారై, విష్ణును షాక్‌కు గురిచేసింది. మే 3న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు ముఠా బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా అనురాధ భోపాల్‌లో ఉందని తెలిసింది. ఒక్కసారిగా సినిమా సన్నివేశంలా మారిన ఈ ఆపరేషన్‌లో, ఒక కానిస్టేబుల్ వధువు కోసం వెతికే వరుడిలా నటించాడు. బ్రోకర్ చూపించిన ఫోటోలలో అనురాధను గుర్తించి, పరిస్థితులను గమనించి ఆమెను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన అనురాధ, యావత్ ఉత్తర భారతంలో బ్రైడ్ మాఫియా నెట్‌వర్క్‌కు ఒక కీలక కీ లింక్‌గా మిగిలింది. ఎట్టకేలకు పోలీసుల తెలివితేటలతో ఆమె పట్టు పడింది. ఇటువంటి మోసాలను నిరోధించేందుకు యువకులు అజాగ్రత్త వహించాలని, పెళ్లికి ముందే పూర్తి వివరాలను తెలుసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ‘వధువు’ అనే పదమే చాలామందికి గడచిన గుర్తుగా మిగలే ప్రమాదం ఉంది!

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :