Thursday, 30 July 2026 09:16:07 PM

రామగిరి ఓసిపి–2 మైన్‌ వద్ద చేరిన వర్షపు నీరు..

రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ టీమ్...

Date : 26 September 2025 10:23 AM Views : 568

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పరిస్థితులను అత్యంత క్లిష్టతరం చేస్తున్నాయి. ముఖ్యంగా రామగిరి మండల పరిధిలోని ఓసిపి–2 మైన్‌ పూర్తిగా నీటితో నిండిపోయింది. వర్షపు వరదనీరు అకస్మాత్తుగా చేరడంతో అక్కడి మేనేజర్‌ ఆఫీస్ వరకు నీరు చేరింది. దీనివల్ల కార్మికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు నిలిచిపోవడంతో సాధారణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితి అదుపు చేయడానికి వెంటనే రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ టీమ్ మైనింగ్ ప్రాంగణానికి చేరుకుని నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టింది.కార్మికుల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి. అధికార వర్గాలు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ, కార్మికుల భద్రతను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. స్థానిక ప్రజలు కూడా భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :