Thursday, 30 July 2026 06:58:13 PM

తప్పుడు సంకేతాలు మానుకొని విద్యార్థులకు ఉన్నత విద్య పై దృష్టి సారించాలి...

Date : 01 August 2025 04:14 PM Views : 410

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఏదైనా తప్పు జరిగినప్పుడో... లేక పొరపాటు అయినప్పుడో ఎవరైనా సహజంగా తప్పించుకోవాలనుకోవడం సర్వసాధారణం... కానీ ఓ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల వ్యవహరిస్తున్న తీరు మరిన్ని అనుమానాలకు అద్దం పట్టేలా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది... ఎప్పుడో పాఠశాలలో కార్యక్రమాన్ని చేసి విద్యార్థులతో ఎటువంటి పనిని చేయించలేదని చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో ఒక వీడియోను ప్రచారం చేస్తూ అసలు విషయాన్ని విద్యార్థులతో పని చేయించడాన్ని కప్పిపుచ్చేందుకు ఆయా పాఠశాలకు సంబంధించిన ఓ అధికారి నాన్న తండాలు పడుతుండడం నవ్వుల పాలుగా మారుతుంది. విద్యార్థులు పారాలు పట్టుకుంటే తప్పులేదు తవ్వి మట్టి తీస్తే పొరపాటు కాదు.. పక్కన మరో విద్యార్థి బండలు ఎత్తితే పనిచేసినట్లు కాదట... మరి ఇది ఆ పాఠశాల సదురు అధికారి ఏ విధంగా ఊహించుకుంటున్నారు చెబితే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా తప్పుడు సంకేతాలు ఇవ్వడం మానుకొని జరిగిన పొరపాటున సరిదిద్దుకుంటే బాగుంటుందనేది పలువురు మేధావుల విశ్లేషణ...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :