Thursday, 30 July 2026 08:09:03 PM

టీ స్టాల్ యజమాని సంబరాలు.. జిల్లాలో హాట్ టాపిక్...సిరిసిల్లలో కలెక్టర్ బదిలీ....

Date : 27 September 2025 05:53 PM Views : 1448

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ బదిలీ ఒక టీ స్టాల్ యజమాని జీవితంలో సంబరాలకు కారణం అయింది. ఈ సంఘటన జిల్లా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ పేరుతో టీ స్టాల్ నిర్వహిస్తూ వచ్చాడు. ఆ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే—దుకాణం సైన్ బోర్డుపై మంత్రి కేటీఆర్ ఫొటోను ఉంచి, ఆ పేరుతో ప్రజలను ఆకర్షించడం. ఈ స్టాల్‌ స్థానికంగా "కేటీఆర్ టీ స్టాల్" అని పిలుస్తారు. ఇటీవల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్టణ పర్యటనలో ఆ స్టాల్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. అనంతరం మునిసిపల్‌ అధికారులు స్టాల్‌ను మూసివేయగా, కొద్ది రోజులకే కూల్చివేశారు. అయితే ఈ చర్య వెనుక కలెక్టర్ ఆదేశాలే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా చిన్న వ్యాపారి అయిన శ్రీనివాస్ ఆర్థికంగా నష్టపోయాడు.ఈ పరిణామాల తర్వాత, నేడు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ వార్త జిల్లాలో వెల్లువెత్తింది. ఈ క్రమంలో టీ స్టాల్ యజమాని బత్తుల శ్రీనివాస్ తన అసంతృప్తిని ఆనందంగా మార్చుకుంటూ టపాసులు కాల్చి సంబరాలు జరపడం అందరి దృష్టిని ఆకర్షించింది.స్థానికులు దీనిపై రెండు కోణాల్లో మాట్లాడుతున్నారు. కొందరు కలెక్టర్ ఆదేశాలతో చిన్న వ్యాపారిపై అన్యాయం జరిగింది. కూల్చివేత అవసరమైతే కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఒక కుటుంబం జీవనోపాధి కోల్పోయిందని విమర్శిస్తున్నారు.ఈ సంఘటన సిరిసిల్ల పట్టణంలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా కలెక్టర్ బదిలీ ఒక పరిపాలనా ప్రక్రియగా ఉండగా, ఒక టీ స్టాల్ యజమాని ఆనందోత్సవంగా జరుపుకోవడం అరుదైన సంఘటనగా నిలిచింది.ఇక రాజకీయంగా కూడా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైపు కేటీఆర్ మీద ఉన్న అభిమానంతో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అన్యాయం జరిగిందని సానుభూతి వ్యక్తమవుతుంది. కలెక్టర్ బదిలీ కారణంగా సిరిసిల్లలో ఒక టీ స్టాల్ యజమాని చేసిన టపాసుల సంబరాలు జిల్లా వాసుల చర్చకు కేంద్ర బిందువుగా మారాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :