Saturday, 01 August 2026 01:24:56 AM

రుణమాఫీ చేయాలనీ బ్యాంకు ముందు రైతుల ఆందోళన...

Date : 29 March 2025 05:04 PM Views : 413

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జోగులంబ గద్వాల జిల్లా : ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సింధనూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15, 000 ఇస్తామని చెప్పి రూ.12,000 లకు తగ్గించారని, అది కూడా వేయకుండా రూ.6 వేలు మాత్రమే వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే భూమిలేని నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకం కింద రూ.12 వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పించన్ల పెంపు ఏవీ లేవన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు దేవేంద్ర రెడ్డి, కుర్వ తిమ్మప్ప, ఉప్పరి దేవేంద్ర, తులసి గౌడ్, కుమ్మరి జమ్మన్న, నడిపి రామన్న, చాకలి రంగన్న, మెడికల్ రాజు, నడిపెన్న, ఉరుకుందమ్మ, పార్వతమ్మ, కోటి, బోయ వీరేష్, నరసింహులు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :