Saturday, 01 August 2026 01:36:06 AM

జగిత్యాలలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన...

Date : 20 September 2025 06:32 PM Views : 300

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : జాతీయ పోషణ మాసం లో భాగంగా జగిత్యాల పట్టణంలోని చిలుకవాడ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్ వైజర్ కే. కవితారాణి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ పండ్లు ఉండేలా చూసుకోవాలని, అలాగే ప్రతీ రోజు కనీసం ఒక పూట చిరుధాన్యాలతో కూడిన భోజనం చేయాలని సూచించారు. అభాకార్డు, అపార్ కార్డు ప్రాముఖ్యతను వివరించి వాటిని అందరూ పొందాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం మాదేశి శిరీషా మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. రక్తహీనత వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, అందరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సావిత్రి, ఆశ కార్యకర్త లావణ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :