Thursday, 30 July 2026 08:44:20 PM

మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిపై చిచ్చు...

టీపిసీసీ మాజీ అధికార ప్రతినిధి దొంతు యాదగిరి తన సభ్యత్వానికి రాజీనామా...

Date : 23 November 2025 01:48 PM Views : 369

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి చెలరేగింది. పార్టీని నడిపిన, కష్టపడిన, గ్రామం గ్రామం తిరిగి కార్యకర్తలను చేర్చుకున్న నేతలను పక్కన బెట్టి, తిరిగి ఎమ్మెల్యే సతీమణికే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జిల్లాలో పెద్ద రాజకీయ సంచలనానికి దారి తీసింది. దీని ఫలితంగా అసమ్మతి, ఆగ్రహం, రాజీనామాల వాతావరణం మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు, టీపిసీసీ మాజీ అధికార ప్రతినిధి దొంతు యాదగిరి తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటిస్తూ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులను పట్టించు కోకుండా, తిరిగి ఎమ్మెల్యే భార్యకే అధ్యక్ష పదవి ఎలా ఇవ్వగలిగారు అని ప్రశ్నించారు. కష్టానికి గౌరవం లేని చోట తమలాంటి నిజాయితీ గల నాయకులకు స్థానం లేదన్న భావనతోనే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.జిల్లాలో పనిచేస్తున్న మరికొంత మంది సీనియర్ నేతలు కూడా ఇదే విధమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. పదవి కోసం కట్టుబాటు, క్షేత్రస్థాయి పోరాటం, పార్టీ బలోపేతం కోసం చేసిన త్యాగాలు విలువలేని పరిస్థితి నెలకొన్నదని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. అలాగే, పార్టీని శక్తివంతం చేసిన కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్యే సతీమణి ఉమకు రావడంతో, ఈ నిర్ణయం కాంగ్రెస్ అంతర్గతంగా మరింత కల్లోలం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా పార్టీ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో, అసంతృప్తి మరింత విస్తరిస్తుందో లేదా పరిస్థితి సర్దుబాటు దిశగా వెళుతుందో చూడాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :