Thursday, 30 July 2026 04:21:34 PM

ఘనంగా మెదక్ జిల్లా పాపన్నపేటలో భగత్‌సింగ్ జయంతి ఉత్సవాలు...

Date : 28 September 2025 01:09 PM Views : 331

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : భగత్‌సింగ్ 118వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రచాకలి పాపయ్య మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం 23 ఏళ్లకే తన ప్రాణాలను అర్పించి యువతలో స్వేచ్ఛాస్ఫూర్తిని రగిలించిన విప్లవకారుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. నేటి తరుణంలో దేశంలో మతోన్మాదం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులు యువత భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఉరితాడును కూడా ఎగతాళి చేసిన వీరుడి జీవితం ప్రతి గ్రామ పల్లెలో స్ఫూర్తిదాయకంగా నిలవాలి. భగత్‌సింగ్ జయంతిని అధికారిక దినోత్సవంగా ప్రకటించాలి. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. ఆయన త్యాగాలు నేటి తరాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని పాపయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు పార్వయ, మండల కార్యదర్శి అరుణ్, సహాయ కార్యదర్శి సంతోష్, మండల ఉపాధ్యక్షులు విక్రమ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :