Friday, 31 July 2026 07:46:48 PM

గో విజ్ఞాన రాష్ట్రస్థాయి పోటీలకు కుర్తివాడ జడ్‌పీ హై స్కూల్‌ విద్యార్థుల ఎంపిక...

Date : 23 October 2025 12:25 PM Views : 359

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : మెదక్ జిల్లా కుర్తివాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మరో గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర గో సేవ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో విజ్ఞాన రాష్ట్రస్థాయి పరీక్ష పోటీలకు ఈ పాఠశాల నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి గో విజ్ఞాన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి కుర్తివాడ పాఠశాల విద్యార్థులు కె. విష్ణువర్ధన్, కె. గణేష్, కె. వైష్ణవి, ఎం. మణికంఠ రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా తమ ప్రతిభను చాటుకుని పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లోక్య నాయక్, శివకుమార్, బాలరాజు, ప్రవీణ్‌కుమార్, వెంకట్రాంరెడ్డి, కుమార్‌గౌడ్, భూషణం, దుర్గాప్రసాద్ పాల్గొని విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది అందరూ కలిసి ఈ విజయాన్ని ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ కుర్తివాడ విద్యార్థులు తమ ప్రతిభతో మెదక్ జిల్లా గర్వకారణంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :