Friday, 31 July 2026 05:26:32 PM

సింగరేణి మెయిన్ హాస్పిటల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి...

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సీఎంఓకు వినతి పత్రం...

Date : 16 April 2025 10:09 PM Views : 392

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా (ఆకాంక్ష న్య సింగరేణి కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన పని భారంకు అనుగునంగా రోజువారి విధులకు తీసుకునే కార్మికుల సంఖ్యను పెంచాలని,రక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మెయిన్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు మాట్లాడుతూ... గత 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న హౌస్ కీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అరకోర మస్టర్లతో, చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి నెలకు కనీసం 26 మాస్టర్లు వచ్చేటట్లుగా చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. సింగరేణి మెయిన్ హాస్పిటల్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులకు పెరుగుతున్న పని భారంను పరిగణలోకి తీసుకోవాలని,వారికి మెరుగైన వైద్యం,సరైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్,విజయ్,రమేష్, రాంబాబు, లలిత, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :