Friday, 31 July 2026 11:41:08 AM

ఎమ్మెల్యేలు రైతుల పక్షాన నిలవకపోతే పోరాటం తప్పదు...

రైతులకు పట్టాలు వచ్చే వరకు వారి తరఫున పోరాడుతా...జాగృతి జనం బాటలో కవిత

Date : 26 October 2025 01:39 PM Views : 463

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నిజామాబాద్ జిల్లా : జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మోపాల్ మండలం బైరాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఫారెస్ట్ అధికారులు పంటను ధ్వంసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాష్‌ను ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు పట్టాలు వచ్చే వరకు వారి తరఫున పోరాడుతానని కవిత హామీ ఇచ్చారు. ఆత్మహత్యల ఆలోచనలు మానుకుని ధైర్యంగా ఉండాలని రైతులను ప్రోత్సహించారు. మంచిప్ప ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించిన ఆమె, ఫారెస్ట్ అధికారులు పంటలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. 9 తండాలు, 3 గ్రామ పంచాయతీలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రైతుల పక్షాన నిలవాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. 30 ఏళ్లుగా సాగుచేస్తున్న భూములు రైతుల హక్కు అని, ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించే వరకు వెనుదిరగమని ఆమె స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :