Friday, 31 July 2026 06:26:48 PM

కాంగ్రెస్ మోసాలకు విసిగి బీఆర్‌ఎస్‌లో చేరిన మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు

Date : 26 January 2026 05:40 PM Views : 253

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలకు విసిగిపోయిన మంచిర్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో 55వ డివిజన్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రాజు, 49వ డివిజన్‌కు చెందిన అబ్దుల్ సత్తార్, 13వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు లింగమూర్తి తమ అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ నూతనంగా చేరిన నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై ప్రజలకు పూర్తిగా విసుకు వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంతలా పాలన సాగిస్తోందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పట్టణంలో కాంగ్రెస్ అగ్ర నాయకుల అనుచరులు చేస్తున్న దాడులు, బెదిరింపులు, అక్రమ సెటిల్‌మెంట్ల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీజీకేఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :