Thursday, 30 July 2026 02:43:54 PM

పాత్రికేయుల అభిప్రాయం మేరకే డివిజన్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు...

- అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్

Date : 03 April 2025 08:09 PM Views : 470

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : మంథని డివిజన్ లోని నాలుగు మండలాల పాత్రికేయుల అభిప్రాయం మేరకే డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని పాత్రికేయుల సమస్యలు, హక్కులను సాధించకోవడనికి పాటు పడుతుందని, డివిజన్ ప్రెస్ క్లబ్ అందరికి ఆదర్శంగా ఉంటుందన్నారు. డివిజన్ లోని పాత్రికేయుల కోరిక మేరకు ఈ డివిజన్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు మహావాది సతీష్ కుమార్ డివిజన్ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి మాదరబోయిన కిషన్, పాత్రికేయులు సిలివేరి మహేందర్, ఎం సంతోష్, పి ఎస్ అశోకన్, రామడుగు శ్రీనివాస్, చిరాల రవీందర్, మాదేశీ శ్రవణ్, నాంపల్లి శ్రీనివాస్, సుభాన్, శంకర్, దాసరి రమేష్, మంథని లక్ష్మన్, అసంపల్లి స్వామి తో పాత్రికేయులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :