Thursday, 30 July 2026 01:53:41 PM

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా..?

అధికారం ఇచ్చింది సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Date : 24 September 2024 05:23 PM Views : 327

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : గత ఐదేళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. జగన్‌ దేవుడిని దర్శించుకోవచ్చని.. అయితే, ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా..? లేదా..? అనేది ముఖ్యం అన్నారు. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి కదా..? అని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా..? అని నిలదీశారు.‘వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా..? లేదా..? అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు లేదా..? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లాలి..? అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు. అది అడిగితే బూతులు తిట్టారు. వైసీపీ హయాంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా..? అన్నారు.హనుమంతుడు బొమ్మా..? వెంకటేశ్వరస్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రథం కాలిపోతే.. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది అని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక భగవంతుడే చూసుకుంటాడు. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్టు కాదు. అపచారం చేసి అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం’ అని చంద్రబాబు అన్నారు.ఆయన (వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి) దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకుఅని ప్రశ్నించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :