Thursday, 30 July 2026 07:45:23 PM

సొంత నియోజవర్గాన్నే పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు...

మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Date : 26 February 2024 09:06 PM Views : 327

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాలుగా కుప్పం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని, అటువంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి అర్హుడు కాదని పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో మాజీ సీఎంను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గడిచిన ఐదేండ్లలో కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి పరిచిందని అన్నారు. కుప్పానికి కృష్ణ నీరును తీసుకొచ్చామని, పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా మార్చిన ఘనత వైసీపీదేనని వెల్లడించారు. కృష్ణ నీటి తో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతామని, ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కుప్పంకు సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తున్నామని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :