Friday, 31 July 2026 11:33:43 AM

చిన్న జగ్గంపేట నీటి సంఘం అధ్యక్షునిగా కూటమీ పార్టీల తరపున ఏకగ్రీవంగా సారిపల్లి వెంకటరమణ

Date : 15 December 2024 05:34 AM Views : 316

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పరిధి చిన్న జగ్గంపేట గ్రామంలో జగ్గమ్మచెరువు నీటి సంఘం అధ్యక్షునిగా సారిపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా చందక సత్యవతి, డైరెక్టర్లుగా గోపి నాగేశ్వరరావు, గారపాటి శ్రీను, గాది అమ్మాజీ, మొగలికొల్ల వెంకటరమణలను కూటమి పార్టీల తరపున ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. నియమితులైన వారికి కూటమి పార్టీ నాయకులు శాలువ కప్పి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సారిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ రైతన్నలే ఈ దేశానికి వెన్నుముక్క అని, రైతులకు ఏ కష్టం వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మొగిలి అప్పారావు, ఇసరపు శ్రీను, టిడిపి నాయకులు శీరం సత్తిబాబు, మొగలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :