Saturday, 01 August 2026 12:28:17 AM

చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో సుప్రీంకోర్టు కీలక తీర్పు...

Date : 16 January 2024 05:47 PM Views : 361

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్యాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపుపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. తదుపరి చర్యల కోసం సీజేఐ కు నివేదించింది. దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి ముందుకు చేరింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :