Thursday, 30 July 2026 07:45:24 PM

చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ....

విరుచుకుపడ్డ మంత్రి గుడివాడ అమర్నాథ్

Date : 16 January 2024 05:51 PM Views : 324

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : 17 ఏపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొసీజర్ ఫాలో కాలేదని క్వాష్ చేయమని మాత్రమే కోరారన్నారు. ఈరోజు తీర్పు వల్ల చంద్రబాబు నిజాయితీపరుడని, దొంగతనం చేయలేదని ఎక్కడా న్యాయస్థానం చెప్పలేదన్నారు.చంద్రబాబు తరపున న్యాయవాదులు గాని, వ్యక్తులు గాని తాము తప్పు చేయలేదని ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబు న్యాయస్థానం ముందు నిలబడి తప్పు చేయలేదని చెప్పవచ్చు కదా అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ అని విరుచుకుపడ్డారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు శిక్ష పడక తప్పదన్నారు.వైఎస్ షర్మిల రెడ్డికి ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే లేని కాంగ్రెస్ పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే తమకేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని పార్టీ కోసం మాట్లాడుకోవడం వృధా అని వ్యాఖ్యలు చేశారు. షర్మిల ప్రభావం జీరో పర్సెంట్ ఉంటుందని మంత్రి అమర్నాత్ పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :