Friday, 31 July 2026 06:27:29 PM

వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్టు

Date : 16 April 2023 12:06 PM Views : 312

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కడప జిల్లా : వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అభిమానులు చేరుకొని సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత నడుమ ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. వివేకా హత్యకేసులో ఆరుగురు ప్రధాన నిందితుల్లో భాస్కర్‌ రెడ్డి ఒకరు. కాగా, సెక్షన్‌ 130 బీ, రెడ్‌ విత్‌ 302, 201 కింద కేసు నమోదుచేసిన సీబీఐ.. భాస్కర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన సతీమణికి సమాచారం ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :