Friday, 31 July 2026 04:39:01 PM

రైతులు అపోహలు నమ్మవద్దని...అన్నివిదాల ఆదుకుంటా..

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

Date : 08 December 2023 07:28 PM Views : 315

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : రైతులు అపోహలు నమ్మవద్దని... ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడు కర్లపాలెం, బాపట్ల, అమరావతి ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. తుఫాసు సహయం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రైతులు ఇంత బాధలో ఉన్నా ఈ ప్రభుత్వంపై అభిమానం చూపెడుతున్నారు. మించౌగ్ తుఫాను తిరుపతి మీదుగా కోస్తా తీరాన్ని తాకింది. దీంతో విపరీతమయిన వర్షం నాలుగురోజుల్లోనే కురిసింది. వర్షపు నీరు పంట పొలాల్లో నిలిచిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వంలో కరవు, వరదలు వచ్చినా పట్టించుకోలేదు’’ అని. ఈ ప్రభుత్వంలో కరవు లేదు ‘‘తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు రేషన్‌తో పాటు కుటుంబానికి 2500 రూపాయలు ఇస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే కాదు కొన్ని మీడియా సంస్థలతోనూ మనం యుద్ధం చేస్తున్నామని నిజాలు చెప్పే మీడియాపై సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కారు. ఈ ప్రభుత్వంలో కరవు లేదు. రైతులు సంతోషంగా ఉన్నారు.ఇన్‌పుట్ సబ్సిడీ త్వరగా ఇచ్చాం. కలెక్టర్లు ఎన్యూమరేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇటీవల కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలపై అక్కసు వెళ్లగక్కారు. తుఫాను జరిగిన వెంటనే కలెక్టర్లకు నిధులు ఇచ్చి సాయం అందించాలని ఆదేశించాం. తాత్కాలిక డ్యామేజి‌కి సంబంధించి రోడ్లు, విద్యుత్ లైన్లును వెంటనే పునరుద్ధరిస్తాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :