Thursday, 30 July 2026 02:34:55 PM

తెలుగు చిత్రసీమలో కోట సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి...

కోట శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు...వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Date : 13 July 2025 12:34 PM Views : 492

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / : ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున కోట శ్రీనివాసరావు మృతిచెందిన విషయం విదితమే.ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ, కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినిమా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. విలక్షణమైన నటనతో కోట్లాది ప్రేక్షకులను మెప్పించిన కోట గారు, ప్రతి పాత్రలో జీవించగలిగిన గొప్ప నటుడు. పద్మశ్రీతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి, ప్రేక్షక లోకానికి తీరని నష్టం అని వ్యాఖ్యానించారు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన వైఎస్ జగన్, తెలుగు చిత్రసీమలో కోట సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :