Friday, 31 July 2026 05:41:28 PM

తిరుపతి శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం...

రోజుకో మలుపు తిరుగుతున్న శ్రీవారి లడ్డు ప్రసాదం...

Date : 24 September 2024 06:18 AM Views : 413

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : అత్యంత పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువు అవశేషాలు ఉన్నాయని ఆరోపణలు తీవ్ర ఆందోళనలకు గురిచేశాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంను కల్తీ చేశారని ఒక్కసారిగా వచ్చిన నివేదికలతో కోట్లాదిమంది భక్తులు తమ ఆవేదనను గురి చేశారు. మరోవైపు లడ్డు కల్తీ వ్యవహారంపై సీట్ విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి భక్తులకు హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం కు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. దర్శన అనంతరం శ్రీవారి లడ్డును కొనుగోలు చేసి ఇంటికి వచ్చాక భక్తులకు లడ్డూను పంచేందుకు తీసి చూడగా లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం, అంబార్ కనిపించడంతో భక్తురాలు పద్మ ఆశ్చర్యానికి గురైంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఇలా పొగాకు కనిపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తురాలు పద్మ కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :