Friday, 31 July 2026 10:38:12 PM

కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ అరెస్టు..

Date : 31 December 2024 05:20 PM Views : 356

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కృష్ణా జిల్లా : మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం, రావి వెంకటేశ్వరావుపై దాడిలో కాళీ కీలక సూత్రధారి కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో 13 మంది వైసిపి నాయకులు రిమాండ్ లో ఉన్నారు. ఈ ఘటనలో సూత్రధారి కాళీని అస్సాంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వైసిపి అధికారంలో ఉండగా గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ అనేక అరాచకాలు సృష్టించినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా వైసిపి యువజన విభాగ అధ్యక్షుడిగా కాళీ ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :