Thursday, 30 July 2026 08:44:49 AM

నా అడ్డు తొలగించుకోవాలనుకుంటే కిరాయి హంతకులను పెట్టి ఒకేసారే చంపేయండి

పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

Date : 05 December 2023 06:09 PM Views : 300

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కడప జిల్లా : సీఎం జగన్‌పై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ రెడ్డి పోలీసులను అడ్డంపెట్టుకొని నన్ను చంపాలని ప్రయత్నించారు. నన్ను అరెస్ట్ చేసిన రోజున ఓ గదిలో ముసుగులు ధరించిన కొత్త వ్యక్తులు తుపాకి గురిపెట్టి అనేక ప్రశ్నలతో బెదిరించారు. పులివెందుల్లో జగన్ రెడ్డి పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నాపై కుట్రపన్నారు. పోలీసుల పేరుతో ఎవరినో రంగంలోకి దింపి ఇలా చెదిరించేవారిని పులివెందుల భాషలో ఏమంటారో మీకు తెలుసు. నన్ను చంపి అడ్డు తొలగించుకోవాలనుకుంటే కిరాయి హంతకులను పెట్టి ఒకేసారే చంపేయండి. ఇలాంటి దిగజారుడు పనులు చేస్తే పులివెందుల ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు.’’ అని బీటెక్ రవి హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :