Friday, 31 July 2026 06:26:14 PM

22న ఎపి‌ ప్రభుత్వం సెలవు ప్రకటించాలి...

బిజెపి రాష్ట్ర అద్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్

Date : 18 January 2024 07:06 PM Views : 1027

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం ఫలించ బోతుందని, 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుందని భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అద్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఈనెల 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు..22వ తేదీన దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని పేర్కొన్నారు.రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బిజెపి పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారు 22న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. 21 వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థం అవుతుందనను. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశిపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదని, ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయిఅయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి‌ ప్రభుత్వం 22న సెలవు ప్రకటించాలని బిజెపి రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :