Thursday, 30 July 2026 11:37:37 AM

వివాహ విందు భోజనం తిని ఒకరి మృతి...

10 మందికి అస్వస్థత...

Date : 09 December 2023 06:11 PM Views : 321

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / శ్రీకాకుళం జిల్లా : సంతోషంగా వివాహ సంబరాలు చేసుకుంటున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళ జిల్లా మందస మండలం నల్లబొడూరులో ఓ ఇంట వివాహం జరిగింది. ఈ సందర్భంగా శనివారం బంధువులకు, మిత్రులకు వివాహ విందు భోజనం ఏర్పాటు చేశారు. విందుకు వచ్చిన బంధువులు భోజనం చేసిన కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిలో మహిళ మృతి చెందగా మరో 10 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిని హరిపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వండిన ఆహారం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :