Friday, 31 July 2026 07:26:59 PM

అత్త చెవిని కొరికిన కోడలు....

ఊడిపోయిన చెవిని అతికించడం సాధ్యం కాదన్నా వైద్యులు...

Date : 09 October 2024 12:01 PM Views : 589

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : అత్త, కోడలు మధ్య జరిగిన గొడవలో క్షణికావేశంలో కోడలు చేసిన పనికి అత్తకు మతిపోయింది.. కోపంలో అత్త చెవిని కోడలు కొరకడంతో ఊడి కింద పడిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామంలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే... తుళ్లూరు గ్రామంలో నివాసం ఉండే కుంభపాటి పావని, శేషగిరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా గత కొంత కాలంగా అత్త నాగమణి, కోడలు పావనికి మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎప్పుడు జరిగినట్టే అత్త, కోడలు మధ్య మళ్లీ గొడవ జరిగి అది ముదిరి చిలికి చిలికి గాలివానాలా మారింది. ఈ క్రమంలో క్షణికావేశంలో కోడలు పావని అత్త నాగమణి చెవును కొరకడంతో ఊడిపోయి కింద పడిపోయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించి అనంతరం జిల్లా ప్రభుత్వ అస్పత్రికి తీసుకవేల్లగా ఊడిపోయిన చెవిని అతికించడం కుదరదని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :