Friday, 31 July 2026 01:17:11 PM

షర్మిల కాంగ్రెస్‌లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర...

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Date : 06 January 2024 06:50 PM Views : 324

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిథ్యం వహించవచ్చని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తాము పట్టించుకోబోమని అన్నారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.సీఏం జగన్‌కు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని సజ్జల స్పష్టం చేశారు. కుటుంబం కోసం జగన్‌ పార్టీ పెట్టలేదని.. తమ విధానాలు తమకు ఉన్నాయని అన్నారు. పార్టీని వీడటానికి కారణం వాళ్లే చెప్పారని అన్నారు. అంబటి రాయుడు ఎందుకు రాజీనామా చేశారో తెలియదని అన్నారు. కొద్దిరోజులు దూరంగా ఉంటానని చెప్పారని చెప్పారు. వైఎస్‌ మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై కూడా అనుమానం ఉందని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :