ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / ఆకాంక్ష డెస్క్ : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు ఉంటాయని తెలిపింది. ఇందుకోసం అక్టోబర్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 25న నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు 30వ తేదీ వరకూ గడువు ఇచ్చింది.ఇక నవంబర్ 13న ఎన్నికలు ఉంటాయి. 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దీంతోపాటు ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానానికి నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 23న ఫలితాలు వెల్లడిస్తారు.న్యూ ఢిల్లీ: ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వివరాలను ప్రకటించింది.
Admin
Aakanksha News