Saturday, 13 June 2026 02:49:41 PM

బీసీ డిమాండ్లపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చను చేపట్టాలి...

బీసీలను విస్మరిస్తే కేంద్రంపై తిరగబడతాం... ఓబిసి జాతీయ సెమినార్ లో జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

Date : 06 December 2024 06:57 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న ఓబీసీల డిమాండ్లపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రెండు రోజులపాటు ప్రత్యేక చర్చను చేపట్టాలని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం బీసీల ఆకాంక్షలను గౌరవించాలని,కేంద్రం కనుక బీసీల హక్కులను కాల రాస్తే బీసీ ఐక్యమై కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్రంపై ఫైర్ అయ్యారు నేడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓబిసి జాతీయ సెమినార్ జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్ కు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, మాజీ పార్లమెంట్ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు, గోవా అధ్యక్షులు మధు నాయక్, ఢిల్లీ అధ్యక్షులు ఆన్సర్ రాజ్, లు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మొదటగా జాజులో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటూన్నారే తప్ప 60 శాతం ప్రజల ఆకాంక్షలను గుర్తించడం లేదన్నారు బీసీల అభివృద్దె దేశ అభివృద్ధి గా ప్రధాని భావించినప్పుడే దేశం అఖండ భారతి గా మారుతుందనిఆయన అన్నారు బీసీ డిమాండ్లపై పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసీ రొండు రోజులపాటు బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట, జాతి జనగణలో బీసీ గణన, జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల పెంపు, తదితర డిమాండ్లపై పార్లమెంట్లో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు దేశంలో సామాజిక న్యాయం ఎజెండగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని, 29 రాష్ట్రాల్లో ఓబిసి ఉద్యమాన్ని బలోపేత చేయడం కోసం దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి ఆరు నెలల్లో లక్ష మందితో ఢిల్లీని దిబ్బందిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు తెలంగాణ మోడల్ గా దేశంలో కుడా కులగనను నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుల్కోవాలి : ఎంపీ మల్లు రవి

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగనణ దిగ్విజయంగా పూర్తి అవుతున్నందున తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా సమగ్రనన జరిపి బీసీలకు విద్యా, ఉద్యోగ ఆర్థిక, రాజకీయ రంగంలో జనాభా ప్రకారం వాటా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి డిమాండ్ చేశారుఎస్సీ, ఎస్టీ అలాగే అగ్రవర్ణాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తూ, బీసీలను మాత్రం పూర్తిగా విస్మరించడం కేంద్రానికి తగదన్నారు బీసీల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతి జనగణలో బీసీ గనణన చేపట్టాలని భారత జోడయాత్ర సందర్భంగా దేశమంత పర్యటించి బిసి నినాదాన్ని ముందుకు తీసుకుపోతున్నారని, బిజెపి బీసీని ప్రధానమంత్రి చేసిన బీసీలకు ఉపయోగం లేకుండా పోయిందని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగనణ నిర్వహించి సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని ఆయన తెలిపారు బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారుమాజీ పార్లమెంట్ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ బీసీల డిమాండ్ల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులను కలిసి బీసీ డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు బీసీ ఉద్యమాన్ని గతంలో మండల కమిషన్ సందర్భంగా చేసిన విధంగా మరొకసారి పెద్ద ఎత్తున ఐక్యంగా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారుబీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో బీసీల చర్చ లేకపోవడం విస్మయానికి గురిచేస్తుందని కనీసం ఈ పార్లమెంటు సమావేశాల్లో 60 శాతం జనాభా ఉన్న బీసీల డిమాండ్ల పరిష్కారం కోసం పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి బీసీల భవిష్యత్తుకు ప్రభుత్వం బాసటగా ఉండాలని ఆయన కోరారు బీసీలను విస్మరిస్తే బిజెపికి రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ నేతలు కుందారం గణేష్ చారి, బాలగొని బాలరాజు గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, జి పాండు కురుమ, దానకర్ణ చారి, చెన్నయ్య, నాగమల్లేశ్వరరావు, జాజుల లింగయ్య, శ్రీనివాస్ గౌడ్ నరసింహ నాయక్, అయిలి వెంకన్న, రఘు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :