Thursday, 30 July 2026 11:42:34 AM

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

Date : 19 February 2025 05:16 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్నదాతల పెట్టుబడుల సహాయార్ధం ఇచ్చే పిఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. తద్వారా ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు జమా కానున్నాయి.ఈ పథకం దార్వా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ నిధులను అందుకోవాలంటే.. ఇ-కెవైసి పూర్తి చేసి.. ఎన్‌పిసిఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి. పిఎం కిసాన్ వెబ్‌సైట్‌లో తమ స్టేటస్ కానీ, రైతుల పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అన్నారు. అంతేకాక.. పిఎం కిసాన్ యాప్‌ కూడా అందులో ఉందని పేర్కొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :