Friday, 31 July 2026 08:31:55 PM

అయోధ్యలో రామయ్య దర్శనానికి పోటెట్టిన భక్తులు...

Date : 23 January 2024 05:28 PM Views : 351

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : అయోధ్యలో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో రామలవారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకే మందిరం వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అధిక సభ్యలో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి రావడంతో తోపులాటకు దారితీసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.కాగా, ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తున్నారు. అయితే పెద్దసంఖ్యలో భక్తులు వస్తుండటంతో దర్శన వేళలను పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు యోచిస్తున్నది. ఆలయ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :