Thursday, 30 July 2026 08:49:52 AM

తెలంగాణా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతుంది...

కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయని ప్రభుత్వాల పట్ల చర్యలు తీసుకోండి... బిజెపి రాష్ట్ర ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

Date : 21 May 2025 06:07 AM Views : 718

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : ఫెడరల్ స్ఫూర్తి గురించి పదేపదే మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా, పేర్లు మార్చుకుంటూ, పథకాల అమలులో నీరు కారుస్తున్న వైనాన్ని , తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేస్తున్న విషయాన్ని కూడా వివరించారు .కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను నార్త్ బ్లాకు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ కలిసి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకువచ్చారు , ఆవాస్ యోజన ,ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కుసుమ యోజన, స్థానిక సంస్థలకి, గ్రామపంచాయతీలకి ,పురపాలక సంఘాలకు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధుల వ్యవహారం విషయంలో కూడా ఏమి చేస్తున్నారు అన్న వివరాలను తెలియపరచడం జరిగింది . ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతుందని ఎఫ్ ఆర్ బి ఎం లిమిట్స్ దాటింది అని కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదని . అప్పుల కోసం వివాదాస్పదంలో ఉన్న ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి జాతీయ బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చి రుణాలను పొందటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని కూడా వివరించారు ,భూముల అమ్మకం ,బీర్ల అమ్మకం తో ఖజానా నింపాలని చూస్తున్నాడని వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయని ప్రభుత్వాల పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు గైకొనాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :