ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఐఐటీలు, ఐఐఎంలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్స్ పాటించాలని,సమానత్వం ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని అఖిలభారత ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేసారు. న్యూ డిల్లీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ2024 సెప్టెంబర్లో ఆర్టీఐ సమాధానాలు ద్వారా సేకరించిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం దేశంలోని రెండు ఐఐటీల్లో మరియు మూడు ఐఐఎంల్లో 90% పైగా అధ్యాపక స్థానాలు జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తుల చేత ఎటువంటి రిజర్వేషన్స్ పాటించకుండా నింపబడినట్లు గా వెల్లడించాయి.ఉదాహరణకు:1. ఐఐఎం ఇండోర్: 97.2% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీకి చెందిన వారే, ఎస్సీ లేదా ఎస్టీ ప్రాతినిధ్యం శూన్యం.2 . ఐఐఎం ఉదయపూర్ మరియు ఐఐఎం లక్నో: 90% పైగా ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీకి చెందిన వారే.3. ఐఐటీ బాంబే మరియు ఐఐటీ ఖరగ్పూర్: 90% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీకి చెందినవారే, అలాగే ఐఐటీ మండీ, గాంధీనగర్, కాన్పూర్, గౌహతి, ఢిల్లీ వంటి ఇతర ఐఐటీల్లో కూడా 80-90% ప్రాతినిధ్యం జనరల్ కేటగిరీకి చెందినదే నని తెలిపారు..మొత్తం మీద: 13 ఐఐఎంలలో: 82.8% జనరల్ కేటగిరీ, 5% ఎస్సీ, 1% ఎస్టీ, 9.6% ఓబీసీ.• 21%ఐఐటి లలో, : 80% జనరల్ కేటగిరి 6% 2, 1.6% 2, 11.2% ఓబీసి.ఈ గణాంకాలు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం కేటాయించబడిన 27% ఓబీసీ, 15% ఎస్సీ, మరియు 7.5% ఎస్టీ స్థానాలకు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు..
ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ స్థానాలు:•
7 ఐఐఎంలలో 256 ఖాళీ స్థానాలు, ఇందులో 88 ఓబీసీ, 54 ఎస్సీ, 30 ఎస్టీ. 11 ఐఐటీలలో: 1,557 ఖాళీ స్థానాలు, ఇందులో 415 ఓబీసీ, 234 ఎస్సీ, 129 ఎస్టీ.ఈ అసమానతలు రిజర్వేషన్ విధానానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా, అల్ప సంఖ్యాక సమాజాలకు ఉన్న అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు..అయితే, ఐఐటీ పాట్నా మరియు ఐఐఎం జమ్ము వంటి కొన్ని సంస్థలు మాత్రమే రిజర్వేషన్ విధానాలను మెరుగుగా అమలు చేస్తూ, సరైన కట్టుబాటు, చిత్తశుద్ది మరియు సరియైన పర్యవేక్షణతో నిబంధనల అమలు చేస్తే అందరికీ తగిన న్యాయంచేయడం సాధ్యమని నిరూపించాయని తెలిపారు. ఐఐటీలు మరియు ఐఐఎంలలో అధ్యాపక నియామక ప్రక్రియలపై స్వతంత్ర సమీక్ష చేపట్టాలని, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితమైన అమలు మరియు నియామకాల్లో పారదర్శకతను నిర్ధారించాలని, అధ్యాపక రోస్టర్లను పారదర్శకంగా నిర్వహించి వాటిని ప్రజలు అందరికీ అందుబాటులో ఉంచాలని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అధ్యాపక స్థానాల లో ఉన్న వేలాది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,.అలాగే రాజ్యసభ సభ్యులు పి. విల్సన్ విద్యా మంత్రిత్వ శాఖను తక్షణ చర్య తీసుకోవాలని, తాను లేవనెత్తిన సమస్యను పరిష్కరించాల్సిన అవసరము చాలా ప్రాధాన్యమైనదని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలును పర్యవేక్షించేందుకు బాధ్యతాయూతమైన పద్ధతులను అనుసరించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను డిమాండ్ చేసారు.ఈ సమావేశం లో జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్, జాతీయ కన్వీనర్ పంకజ్ రాజశేఖర్ కుష్వాహ, జాతీయ కోఆర్డినేటర్ రితు, జాతీయ కార్యదర్శి పుష రాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘం ఇన్ఛార్జ్ అరవింద్ పాల్గొన్నారు
Admin
Aakanksha News