Friday, 31 July 2026 01:15:15 PM

ఈడీ విచారణకు ఈసారి కూడా ఢిల్లీ సీఎం డుమ్మా...

Date : 18 January 2024 02:51 PM Views : 328

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దీనికి సంబంధించి ఈడీకి ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం గోవాకు వెళ్తున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని కేజ్రీవాల్ చెప్పినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల కోసం గోవా వెళ్తున్న కారణంగా తాను ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీ సీఎం తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాకి మూడు రోజుల పర్యటనకు వెళ్ళనున్నారు. గోవాలో పార్టీ ముందస్తుగానే కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని అందుకే వెళ్ళక తప్పడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కేజ్రీవాల్ చెప్పినట్టు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :