Thursday, 30 July 2026 05:45:39 PM

తెలంగాణలో తొలగించబడిన 26 కులాలను కలిపేటట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి...

కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును కోరిన ఆళ్ల రామకృష్ణ

Date : 28 March 2025 05:52 PM Views : 419

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : మన ఉత్తరాంధ్ర బీసీ నాయకులు ఢిల్లీ వచ్చిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని 26 కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ తుమ్మరాడ శ్రీనివాసరావు కలిసి తెలంగాణలో తొలగించబడిన 26 కులాలను వెంటనే కలిపేటట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే కేంద్రంలో తెలంగాణ బీసి లకు 42 శాతం రిజర్వేషన్స్ మరియు తెలంగాణ బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పెట్టేటట్టు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారిని కోరినట్లు ఆళ్ల రామకృష్ణ తెలిపారు.అందుకు మంత్రి సమ్మతి తెలియజేస్తూ పై సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించే దిశలో ఉన్నామని చెప్పినట్లు రామకృష్ణ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :