ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యేకంగా రోగులను పరీక్షించడానికి ప్రోటోకాల్స్ అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో పలు సందర్భాల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న సమయంలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఐసీయూలో రోగుల అడ్మిషన్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వారి బంధువులు నిరాకరించిన సందర్భంలో ఐసీయూలో చేర్చుకోలేరని తెలిపింది.ఐసీయూ అడ్మిషన్‌కు సంబంధించిన ఈ మార్గదర్శకాలను క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ప్రత్యేక అనుభవం ఉన్న 24 మంది ఉన్నత వైద్యుల ప్యానెల్ తయారు చేసింది. రోగిని ఐసీయూలో ఉంచాల్సిన వైద్య పరిస్థితుల జాబితాను ప్యానెల్ రూపొందించింది. ప్రత్యేక పర్యవేక్షణ అవసరమయ్యే ఏ రోగికైనా క్లిష్ట అనారోగ్యం ఉన్న సందర్భాల్లో కూడా ఐసీయూ సిఫారసు చేస్తారు. ప్యానల్‌లోని నిపుణుల్లోని ఒకరు మాట్లాడుతూ.. ఐసీయూ పరిమిత వనరులున్నాయి. ప్రతి ఒక్కరినీ చేర్చుకోవడం ద్వారా, అత్యవసర కేసుల్లో రోగులు అవసరమైనప్పుడు పడకలు అందుబాటులో ఉండకపోవచ్చని.. కాబట్టి ఈ మార్గదర్శకాలు అవసరమన్నారు. దాంతో రోగి కుటుంబానికి, ఆసుపత్రి పరిపాలనకు మధ్య పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Admin
Aakanksha News