Thursday, 30 July 2026 07:59:03 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్...

Date : 18 January 2025 06:50 AM Views : 399

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను మంత్రి నార్త్ బ్లాక్ కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ శుక్రవారం సాయంకాలం కలిశారు ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా ఆమె తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల దేశంలో పారిశ్రామిక అభివృద్ధి ,పట్టణాభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగంలో రైల్వేలు జాతీయ రహదారులు గణనీయంగా రాణించాయని వారు కొనియాడారు రైల్వేల కోసం గతంలో ఏర్పరిచిన ప్రత్యేక బడ్జెట్ ని తీసివేసి ప్రధాన బడ్జెట్ తో అనుసంధానం చేసిన తర్వాతనే దేశంలో రైల్వేలు గణనీయంగా అభివృద్ధి చెందాయని ప్రభాకర్ పేర్కొన్నారు . చిన్న మొత్తాల పొదుపు పథకాలు, మహిళా స్వయం సహాయక సముదాయాల కృషితో ఆర్థిక రంగం స్థిరంగా ఉందని వారు పేర్కొన్నారు భారత్ ఐదు ట్రిలియన్ ఎకనామి చేరుకుంటుందని ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు . కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు . తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ భూములమ్ముకోవటం, బీర్లు అమ్ముకోవడంతో కాలం వెళ్లబుచ్చుతున్నారని అదే ప్రభుత్వానికి ఆదాయంగా భావించారని . రోజురోజుకీ స్థిర ఆస్తులు కరిగిపోతున్నాయని వారు వాపోయారు .

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :