Saturday, 13 June 2026 02:56:53 PM

ఢిల్లీలో మరోసారి పడిపోయిన గాలి నాణ్యత...

గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు

Date : 17 December 2024 04:52 PM Views : 372

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఢిల్లీలో మరోసారి గాలి నాణ్యత పడిపోయింది. సోమవారం రాత్రి 10 గంటలకు గాలి నాణ్యత 400 పాయింట్లకు పడిపోయింది. దీంతో గ్రాప్ 4 ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చామని అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక కమిటీ ఆదేశాల మేరకు సంబంధిత రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలోని లోధి రోడ్ లో ఉష్ణోగ్రత 5 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాహనదారులకు దృశ్యమానత తగ్గిపోవడంతో లైట్ల వెలుతురులోనే వారు ప్రయాణాలు చేస్తున్నారు. గాలి నాణ్యతలు, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :