Thursday, 30 July 2026 03:11:53 PM

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు...

ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు

Date : 19 January 2024 04:12 PM Views : 338

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇక జనవరి 23వ తేదీన ఈ కమిటీ తొలిసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తూ.. మోదీ సర్కార్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :