Thursday, 30 July 2026 01:22:27 PM

గోదావరిఖనిలో పాల దొంగలు....

స్కూటీపై వచ్చి 25 లీటర్ల పాలు ఎత్తుకెళ్ళిన ముగ్గురు యువకులు...

Date : 28 September 2024 06:49 AM Views : 1793

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : మీరు వివిధ రకాల దొంగతనాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి దొంగతనాలు మాత్రం ఎక్కడా చూసి ఉండరు. అదేంటో కానీ ఇటీవల పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో పందెం కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన వార్తలొచ్చాయి. అయితే ఇది ఎవరైనా మద్యానికి బానిసలుగా మరీనా యువకులు చేస్తున్నారా...? లేక పథకం ప్రకారమే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నా...? అనేది అనుమానాస్పదంగా మారుతుంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో జరిగిన విచిత్రమైన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే... జీవన్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా ఏరిటేజ్ పాల ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే పాలను ధింపడానికి వ్యాన్ వచ్చి రోజు వేసే చోటనే పాల డబ్బలను పెట్టి వెళ్లిపోయారు. దీంతో ఉదయం పాలు షాపులలో వేయడానికి ఏజెన్సీ నిర్వాహకుడు జీవన్ అక్కడికి వెళ్లి చూసే సరికి 2 పెట్టేల పలు 25 లీటర్లు తక్కువగా ఉన్నాయి. ఇదేంటని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం పాల వ్యాన్ సంబంధించిన వారిని వివరాలు అడిగి తెలుసుకొని సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని ముగ్గురు యువకులు తాము తీసుకొని వచ్చిన స్కూటీ నెంబర్ ప్లేట్ కనిపించకుండా స్టిక్కర్ వేసి పాల బాక్సులను తీసుకవెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.దీంతో ఈ సంఘటన చూసిన మిల్క్ ఏజెన్సీ నిర్వాహకుడు జీవన్ అవాకైయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :