Friday, 31 July 2026 04:25:32 PM

వివేక్ కుటుంబానికి భరోసా ఎవరిది....❓

కాంట్రాక్ట్ కార్మికుని ప్రమాదానికి కారకులెవరు..⁉️

Date : 09 April 2023 12:41 PM Views : 1635

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకోస్తూ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుని ప్రమాదానికి ఎవరు కారణమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లోని ప్రభుత్వాసుపత్రిలో రమేష్ నగర్ కు చెందిన వివేక్ ఎలక్ట్రిషన్ గా 8 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ కోతలు ఉంటాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లోని ఫీజులను మార్చడానికి పైకి ఎక్కిన సమయంలో ఒక్కసారిగా కరెంటు సరఫరా కావడంతో అక్కడి నుండి కింద పడి పోవడంతో వివేకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రిలోకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. అయితే ఈ ప్రమాదంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు కరెంటు సరఫరా నిలిపి వేస్తున్నామని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులా...? లేక పని ఒత్తిడికి గురి చేసే విధానం వల్లనో ఏమో కానీ ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రమాదానికి గురయ్యాడు. ఏది ఏమైనా దీనిపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :