Thursday, 30 July 2026 12:38:32 PM

లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో మహిళ హత్య...

తల నరకడంతో పాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసిన వైనం

Date : 15 December 2024 06:24 PM Views : 810

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఆమె తల నరకడంతోపాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోశాడు. శరీర భాగాలను పలుచోట్ల పడేశాడు. తెగిన తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేసి చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం రీజెంట్ పార్క్ ప్రాంతంలో తెగిన మహిళ తల పాలిథిన్ బ్యాగ్‌లో ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే శనివారం చెరువు సమీపంలో మహిళ మొండెం, దిగువ భాగాన్ని పోలీసులు కనుగొన్నారు.కాగా, ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 35 ఏళ్ల అతిఉర్ రెహమాన్ లస్కర్‌ నిందితుడిగా గుర్తించారు. సొంతూరుకు పారిపోయిన అతడ్ని అరెస్ట్‌ చేశారు. లస్కర్‌ను ప్రశ్నించగా లైంగిక కోరిక తీర్చనందుకు ఆ మహిళను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :