Thursday, 30 July 2026 02:44:35 PM

రామగుండంలో రేషన్ బియ్యం అంత మోహన మాయ జాలం...

అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ళ పీడీఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు.

Date : 17 February 2024 06:47 AM Views : 1092

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో రేషన్ మాఫియా అంత మోహన మయం జాలంగా మారుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రేషన్ మాఫియా కింగ్ అడ్డదారిన బియ్యాన్ని సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నాడు.ఈ దందాలో సదురు రేషన్ మాఫియా కింగ్ కొంత మందిని అనుచరులుగా పెట్టుకొని నిత్యం రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ రేషన్ మాఫి కింగ్ గా చేలామణి అవుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు .ఐపీఎస్. (డిఐజీ) ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తిలక్ నగర్, అడ్డగుంటపల్లిలోని ఒక ఇంట్లో పీడీఎస్ రైస్ ను నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహించగా అడ్డగుంటపల్లికి చెందిన మోహన్ గుప్తకు సంబంధించి అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ళ పీడీఎస్ రైస్ ను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సదరు రేషన్ మాఫియా కింగ్ ను ఉన్నతాధికారులు విచారిస్తే పెద్ద ఎత్తున కొంతమంది అవినీతి బాగోతాలు బయట పడతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ అక్రమ దందాలో పెద్ద ఎత్తున కొంతమందికి నిత్యం లక్షల రూపాయలు సైతం చేతులు మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :