Thursday, 30 July 2026 01:21:56 PM

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

Date : 24 May 2023 05:38 PM Views : 585

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కరీంనగర్ జిల్లా : చేగుంట మండల కేంద్రంలోని మామిడికుంటలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది, స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన బొక్క యాదగిరి, గేటు మల్లేశం ఇద్దరు కలిసి మంగళవారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వ్యవసాయ పొలాలు వెతికిన ఆచూకీ దొరకక పోవడంతో బంధువులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా చేగుంట పోలీసులు వారి సెల్ నెంబర్ ఆధారంగా లోకేషన్ గుర్తించడంతో చేగుంట మామిడికుంట శివారులో ఇద్దరు వ్యక్తుల బట్టలు చెప్పులు బండి లభ్యమయ్యాయి, వాటి ఆధారంగా కుంట సమీపంలో చూడగా ఒక వ్యక్తి నీళ్లలో తేలినట్టు కనిపించడంతో ఈతగాళ్ల సహాయంతో బొక్క యాదగిరి గేటు మల్లేశం, శవాలను బయటకి తీశారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :