Saturday, 01 August 2026 01:34:42 AM

ఆదిలాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో వాగులో గల్లంతైన యువకుడు

Date : 12 July 2025 06:21 AM Views : 484

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆసిఫాబాద్ జిల్లా : చింతలమానేపల్లి మండలంలోని కేతిని గ్రామ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సేడ్మక సుమన్‌ (18) అనే యువకుడు వాగులో గల్లంతయ్యాడు.వివరాల్లోకి వెళ్తే... సుమన్‌ తన పశువులను మేత మేపేందుకు వాగు అవతల ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. అయితే పశువులు పంటను తింటుండటంతో ముగ్గురు స్నేహితులతో కలిసి వాగు దాటి వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో వాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో సుమన్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అతనితో పాటు ఉన్న ముగ్గురు యువకులు కష్టంగా ఒడ్డుకు చేరుకున్నారు. సుమన్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలియజేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం స్థానికులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కలిసి వాగు పరిసరాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :