Thursday, 30 July 2026 12:12:24 PM

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జీపు బోల్తాపడి ఇద్దరు పోలీసులు మృతి

Date : 02 May 2023 03:48 PM Views : 608

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు జీపు బోల్తాపడి ఇద్దరు పోలీసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఏటూరు నాగారంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్రయ్య జీపు డ్రైవర్‌తో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ఏటూరు నాగారాం సమీపంలోని జీడివాగు కల్వర్టు వద్దకు రాగానే జీపు ప్రమాదానికి గురై ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు జీపు డ్రైవర్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎస్‌ఐ ఇంద్రయ్య స్వస్థలం హన్మకొండగా తెలిసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతేదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :