Friday, 31 July 2026 10:39:33 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేకు నిరసన సెగ...

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బర్రెలు కట్టేసి పాడి రైతు దంపతుల ఆందోళన... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విచిత్ర నిరసన...

Date : 01 August 2025 08:22 AM Views : 573

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు దంపతులు కూరాకుల ఓదెలు, లలిత శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బర్రెలను కట్టేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ బర్ల షెడ్డును అన్యాయంగా కూల్చేశారన్న ఆవేదనతో వారు ఈ తీరైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తాము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎమ్మెల్యేకు ఓటు వేయడమే తప్పిదమా? అని నిలదీసిన వారు, ఆయన చెప్పినందుకే అధికారుల ద్వారా షెడ్డును కూల్చించారని ఆరోపించారు. మా బర్రెలు ఎక్కడ ఉంచుకోవాలి? షెడ్డు లేకుండా మేము ఎలా జీవించాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు సైతం ఎమ్మెల్యే ఆదేశానుసారంగానే షెడ్డును కూల్చినట్టు చెబుతున్నారని చెప్పిన రైతు దంపతులు, షెడ్డు తిరిగి నిర్మించే వరకు బర్రెలను ఎక్కడికీ తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాల నుండి స్పందన ఇంకా రావాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :