Thursday, 30 July 2026 01:33:57 PM

జగిత్యాల జిల్లా కోరుట్ల–మెట్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...

Date : 12 January 2026 11:35 AM Views : 260

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : కోరుట్ల–మెట్ పల్లి జాతీయ రహదారిపై జీఎస్ గార్డెన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, అదే టీఎస్ 16 ఎఫ్ హెచ్ 8716 నంబర్ గల కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం.ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు జాతర కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :